JP Naddas to PVN Madhav: కూటమి ప్రభుత్వ కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లండి
ABN , Publish Date - Jul 20 , 2025 | 05:40 AM
కూటమి ప్రభుత్వ కృషిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పీవీఎన్ మాధవ్‌కు దిశానిర్దేశం చేశారు.
మాధవ్‌కు జేపీ నడ్డా దిశానిర్దేశం
న్యూఢిల్లీ, జూలై 19(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ కృషిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పీవీఎన్ మాధవ్‌కు దిశానిర్దేశం చేశారు. పార్టీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా మాధవ్, నడ్డాతో శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్ఠం చేయడం, రాష్ట్రాభివృద్ధికి కూటమి సర్కారు నిరంతరం శ్రమిస్తున్న విషయాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని నడ్డా సూచించారు. సమష్టి కృషితో పార్టీని మరింత పటిష్ఠం చేస్తానని మాధవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.