Market Yard Development: మార్కెట్ యార్డులు బలోపేతం
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:53 AM
రాష్ట్రంలో వ్యవసాయ మార్కె ట్ యార్డుల వ్యవస్థను మరిం త బలోపేతం చేయడానికి సంయుక్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఏఎంసీ చైర్మన్లు ఏకగ్రీవంగా నిర్ణయించారు.
ఏఎంసీ చైర్మన్ల నిర్ణయం
సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా హరిబాబు ఎన్నిక
అమరావతి/మంగళగిరి డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ మార్కె ట్ యార్డుల వ్యవస్థను మరిం త బలోపేతం చేయడానికి సంయుక్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఏఎంసీ చైర్మన్లు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆదివారం మంగళగిరిలోని ఆర్‌ఆర్‌ఆర్ కన్వెన్షన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఏఎంసీ చైర్మన్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. తొలుత దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ల సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నంద్యా ల యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, ఉపాధ్యక్షులుగా కె.సుజాత రామచంద్రరాజు(భీమవరం), వై.రమాదేవి(కనిగిరి), కోగంటి బాబు(కంచికచర్ల), జి.మునిరాజు(కుప్పం), ఎం.మంగతల్లి(పాడేరు), ప్రధాన కార్యదర్శులుగా జి. అమరనాథ్ యాదవ్(పులివెందుల), కె. ప్రవీణ్‌కుమార్ (ఉయ్యూరు), కోశాధికారిగా జి.వెంకట రమణ(నర్సీపట్నం), పలువురు అధికార ప్రతినిధులను, జిల్లా కోఆర్డినేటర్లను ఎన్నుకున్నారు. మార్కెట్ కమిటీల అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. జగన్ పాలనలో తెచ్చిన విధానాన్ని రద్దు చేసి, గతంలో మాదిరిగా యార్డు చైర్మన్లకు చెక్‌పవర్ కల్పించాలని, యార్డులను ఏ,బీ,సీ,డీ గ్రేడ్‌లుగా వర్గీకరించినట్లే.. చైర్మన్లను కూడా గ్రేడ్‌ల వారీగా తగిన సౌకర్యాలు, ఆర్థిక భరోసా, స్వయంప్రతిపత్తి కల్పించాలని.. పలు తీర్మానాలు చేశారు. సీఎం చంద్రబాబు నిర్దేశించిన ‘పంచసూత్రాల’ పథకం వ్యవసాయ రంగం లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతుందని చైర్మన్లు అభిప్రాయపడ్డారు.