PVN Madhav: గ్రామస్థాయిలో బీజేపీని బలోపేతం చేయాలి
ABN , Publish Date - Sep 12 , 2025 | 05:20 AM
గ్రామస్థాయిలో బీజేపీని బలోపేతం చేసే లక్ష్యంతో పనిచేయాలని కార్యకర్తలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు.
కార్యకర్తలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపు
అనకాపల్లి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): గ్రామస్థాయిలో బీజేపీని బలోపేతం చేసే లక్ష్యంతో పనిచేయాలని కార్యకర్తలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. బీజేపీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు. గురువారం అనకాపల్లిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాధవ్ మాట్లాడుతూ కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాని మోదీ కృషి అమోఘమని కొనియాడారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన మాధవ్‌కు నాయకులు సాదర స్వాగతం పలికారు.