Minister Lokesh: విశాఖ పారిశ్రామిక సదస్సుకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:44 AM
నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పారిశ్రామిక భాగస్వామ్య సదస్సును విజయవంతంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం...
లోకేశ్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ
అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పారిశ్రామిక భాగస్వామ్య సదస్సును విజయవంతంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో చైర్మన్ లోకేశ్ అధ్యక్షతన ఆ మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సమావేశమయ్యారు. సీఐఐ ఆధ్వర్యంలో జరిగే 30వ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా వ్యూహాత్మక కార్యాచరణను అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే సంస్థలతో సదస్సులో అవగాహనా ఒప్పందాలు చేసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై చర్చించారు. ఈ సందర్భంగా విశాఖ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు అధికారిక వెబ్‌సైట్‌ను మంత్రి లోకేశ్ ప్రారంభించారు.