Share News

గాలివాన బీభత్సం

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:13 AM

మండలంలో గురువారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది.

గాలివాన బీభత్సం
ప్యాపిలి మండలంలోని పీఆర్‌పల్లిలో నేల కూలిన నర్సరీ షెడ్డు

ప్యాపిలి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): మండలంలో గురువారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. బలంగా వీచిన ఈదురు గాలులకు పీఆర్‌పల్లి గ్రా మంలో ఇటీవల కొత్తగా నిర్మించుకున్న నర్సరీ షెడ్డు నేల కూలింది. దీంతో రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు శ్రీనివాసలు ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే నల్లమేకలపల్లి గ్రామంలో రైతు రాజగోపాల్‌ నాయుడుకు చెందిన ఐదు ఎకరాల్లో అరటి దెబ్బ తిన్నది. దాదాపు రూ.10లక్షల నష్టం జరిగినట్లు బాధి తుడు వాపోయాడు. పీఆర్‌పల్లి గ్రామంలో మామిడి కాయలు నేలరాలాయి.ఈదురు గాలులకు దెబ్బ తిన్న అరటి తోటను ఉద్యానవనశాఖ అసి స్టెంట్‌ షేక్‌ షన వాజ్‌ పరిశీలించారు. పంట నష్టం అంచనా వేసి ప్ర భుత్వా నికి నివేదిక పంపుతామని ఆయన తె లిపారు. ఆయన వెంట రైతు ప్రేమ సాగర్‌రెడ్డి ఉన్నారు.

బనగానపల్లె: మండలంలోని పెద్ద రాజుపాలెం, పసుపుల, చిన్నరాజు పా లెం, పెద్దరాజుపాలెం తండా, చిన్నరా జుపాలెం తండా గ్రామాల పరిఽధిలో శుక్రవారం సాయంత్రం గాలివాన బీ భత్సానికి పది వృక్షాలు విరిగిపోయా యి. బనగానపల్లె- గుత్తి రహదారిలో రోడ్డుపై భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డు గా పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పొలాల్లో ఆర బోసిన మొక్కజొన్న పంట తడిసిపోయాయి.

కోవెలకుంట్ల : పట్టణంలో శుక్రవారం సాయం త్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరు ములు, మెరుపులతో కూడిన వడగండ్లతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో ఒక్కసారిగా వాతా వరణం చల్లబడింది. వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలు ఈ వర్షంతో కాస్త ఊరట కలిగించింది. మిరప, మొక్కజొన్న కల్లాల్లో ఉండడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.

రుద్రవరం : రుద్రవరం మండలంలో శుక్రవారం సాయంత్రం గాలి దుమారం బీభత్సం సృష్టించింది. మండలంలోని ఆలమూరు గ్రామంలో వంద ఎకరా ల్లో బొప్పాయి తోటల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఒక్కో ఎకరాకు రూ.లక్ష చొప్పున వంద ఎకరాలకు కోటి రూ పాయలు నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోయారు. రోడ్లపై, పంట పొలాల్లో మొక్కజొన్నలు, వరి ధాన్యం కుప్పలరాశులున్నాయి. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరారు. రుద్రవరం సమీపంలో విద్యుత స్తంభాలు నేలకూలాయి. తీవ్ర నష్టం వాటిల్లింది.

చాగలమర్రి: చాగలమర్రి మండలంలో శుక్రవారం గాలి, వాన జోరుగా వర్షం కురిసింది. చాగలమర్రి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముత్యాల పాడులో భారీ వర్షం కురిసింది. గాలివానతో చాగలమర్రి, గొడిగనూరు, చిన్నబోదనం, చాగలమర్రి సర్వీసు రహదారుల్లో ఆరబెట్టిన మొక్కజొన్న, పంట పొలాల్లో కోత కోసి ఉంచిన నువ్వు, సజ్జ పంటలు తడిచి దెబ్బతిన్నాయి. ఆరబెట్టిన ధాన్యంపై పట్టలు కప్పే ప్రయత్నంలోనే అకాల వర్షం నష్టం కలిగించిం దని రైతులు విలపించారు. చిన్నవంగలి గ్రామంలో గాలి జోరుగా వీచడంతో రైతులు సాగు చేసిన బొ ప్పాయి చెట్లు విరిగి పడ్డాయి. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరారు.

బనగానపల్లె: మండలంలోని చిన్నరాజుపాలెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం భారీగా వీచిన గాలివానకు మామిడితోటలో భారీగా గాలి, వాన భీభత్సంతో మామిడి తోటలు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా క్రిష్ణగిరి నుంచి చిన్నరాజు పాలెం, పెద్దరాజుపాలెం, పసుపుల తదితర గ్రామాల్లో ఉన్న మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి. మరికొన్ని చోట్ల ఆరబోసిన మొక్క జొన్నలు తడిసి ముద్దయ్యాయి. దీంతో మామిడి, మొక్కజొన్న రైతు కొంత వరకు నష్టపోయారు.

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలోని పలు గ్రామాలలో శుక్ర వారం బలమైన గాలి వీయగా వర్షం పడింది. ము ఖ్యంగా అహోబిలంలో వడగండ్ల వాన కురిసింది. దీం తో ప్రజలు, దైవదర్శనానికి వచ్చిన వారు ఆశ్చర్యంగా తిలకించారు. ఎండలు మండుతున్న తరుణంలో వడగండ్ల వాన పడడం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చిం ది. తీవ్ర మైన గాలుల కారణంగా అహోబిలం తోపా టు బాచెపల్లె తండా, బాచెపల్లె క్రిష్ణపురం గ్రామాల లో చెట్లు నెలకొరిగాయి. అకాల వర్షం కారణంగా రోడ్ల వెంట ఆరబోసుకొన్న మొక్కజొన్న పంట తడిసి పోవడంతో రైతులు ఆవేదన చెందారు.

Updated Date - Apr 19 , 2025 | 12:13 AM