డీవైఎఫ్ఐ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేయాలి
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:23 AM
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా...
జంతర్‌మంతర్ వద్ద ధర్నాలో డీవైఎఫ్ఐ డిమాండ్
న్యూఢిల్లీ, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల పేరుతో ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తోందని డీవైఎఫ్ఐ అధ్యక్షుడు,ఎంపీ ఏఏ రహీం ఆరోపించారు.శుక్రవారం,డీవైఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్వర్యంలో జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రహీం, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బి.వెంకట్, ఐద్వా కోశాధికారి పుణ్యవతి, డీవైఎ్‌ఫఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడారు.