AP Govt: నాన్ ఎస్‌సీఎస్ కోటా 6 పోస్టుల భర్తీకి చర్యలు
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:57 AM
నాన్ సివిల్ సర్వీసెస్ కోటా ఐఏఎస్ పోస్టుల భర్తీకి లైన్ క్లియరైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6పోస్టుల భర్తీకి ప్రభుత్వం...
29, 30 తేదీల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): నాన్ సివిల్ సర్వీసెస్ కోటా ఐఏఎస్ పోస్టుల భర్తీకి లైన్ క్లియరైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6పోస్టుల భర్తీకి ప్రభుత్వం 29మంది పేర్లను కేంద్రానికి పంపించింది. ఆ జాబితాలోని అభ్యర్థులకు రెండు విడతల్లో యూపీఎస్సీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈనెల 29వ తేదీన 15 మందికి, 30వ తేదీన 14 మందికి ఇంటర్వ్యూలకు హాజరు కావాలంటూ యూపీఎస్సీ నుంచి ఆహ్వానం అందింది. ఎంపికైనవారి జాబితాను యూపీఎస్సీ జనవరిలో విడుదల చేయనుంది.