Minister Satya kumar: స్టెమీతో 95.94శాతం మందికి ప్రాణదానం
ABN , Publish Date - Nov 26 , 2025 | 06:34 AM
గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటు మరణాలను తగ్గించేందుకు అమలు చేస్తున్న స్టెమీ ప్రాజెక్టుతో గతేడాది జూన్ 1 నుంచి ఈ నెల 15 వరకు 3,027 మంది ప్రాణాలు నిలిచాయని...
ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటు మరణాలను తగ్గించేందుకు అమలు చేస్తున్న స్టెమీ ప్రాజెక్టుతో గతేడాది జూన్ 1 నుంచి ఈ నెల 15 వరకు 3,027 మంది ప్రాణాలు నిలిచాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ప్రవేశపెట్టిన స్టెమీ విధానం కింద ఖరీదైన టెనెక్టప్లస్ ఇంజక్షన్ ఉచితంగా ఇవ్వడం ద్వారా విలువైన ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు. ఛాతీ నొప్పి లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చినవారిలో ఈ ఇంజక్షన్ అవసరమని గుర్తించిన 3,155 మందిలో 3,027 (95.94శాతం ) మంది ప్రాణాలు నిలబడినట్లు పేర్కొన్నారు. స్టెమీ కింద ప్రతినెలా సగటున 175 మంది ప్రభుత్వాస్పత్రుల్లో టెనెక్టప్లస్ ఇంజక్షన్ పొందుతున్నారని మంత్రి పేర్కొన్నారు.