Share News

Minister Srinivas Varma: ఆత్మనిర్భర్‌ లక్ష్యసాధనలో ఉక్కుదే కీలక పాత్ర

ABN , Publish Date - Sep 09 , 2025 | 06:19 AM

ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యసాధనలో ఉక్కు పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.

Minister Srinivas Varma: ఆత్మనిర్భర్‌ లక్ష్యసాధనలో ఉక్కుదే కీలక పాత్ర

  • ఏపీలో ఆర్సెలార్‌కు త్వరలోనే శంకుస్థాపన: మంత్రి శ్రీనివాసవర్మ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యసాధనలో ఉక్కు పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌ (ఐఎ్‌సఏ)ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో సోమవారం ప్రారంభమైన 6వ ఐఎ్‌సఏ స్టీల్‌ కాన్‌క్లేవ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌ నక్కపల్లిలో ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ నూతనంగా ఏర్పాటు చేస్తున్న భారీ ఉక్కు పరిశ్రమకు అవసరమైన అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయి. త్వరలోనే శంకుస్థాపన జరగనుంది’ అని మంత్రి తెలిపారు.

Updated Date - Sep 09 , 2025 | 06:20 AM