యువత వ్యసనాలకు దూరంగా ఉండండి
ABN , Publish Date - May 29 , 2025 | 11:58 PM
యువత వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా, దూరంగా ఉండాలని సెట్కూరు సీఈవో డాక్టర్ కె.వేణుగోపాల్ అన్నారు. గురువారం జిల్లా యువజన సంక్షేమ శాఖ, జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో బనవాసి ప్రభుత్వ వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో డ్రగ్స్ దుర్వినియోగం, యోగాంధ్రపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సెట్కూరు సీఈవో డాక్టర్ వేణుగోపాల్
కర్నూలు స్పోర్ట్స్, మే 29 (ఆంధ్రజ్యోతి): యువత వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా, దూరంగా ఉండాలని సెట్కూరు సీఈవో డాక్టర్ కె.వేణుగోపాల్ అన్నారు. గురువారం జిల్లా యువజన సంక్షేమ శాఖ, జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో బనవాసి ప్రభుత్వ వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో డ్రగ్స్ దుర్వినియోగం, యోగాంధ్రపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఈవో మాట్లాడుతూ విద్యార్థులు డ్రక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యోగా చేయడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తుందని, ప్రతి రోజు విద్యార్థులు యోగా చేయాలని తెలిపారు. కళాశాల ప్రధానోపాధ్యాయుడు ఇతర ఉపాధ్యాయులకు యోగాంధ్రలో రిజిస్ర్టేషన ప్రక్రియను వివరించి విద్యార్థులందరూ జూన 21న జరిగే యోగాంధ్ర ఈవెంట్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి పి.సోమశివారెడ్డి, సెట్కూరు పర్యవేక్షకులు శ్యాంబాబు, ప్రిన్సిపాల్ గురు విష్ణు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రవీణ, విద్యార్థులు పాల్గొన్నారు.