Share News

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:18 PM

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సెట్కూరు సీఈవో డాక్టర్‌ వేణుగోపాల్‌ సూచించా రు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
మాట్లాడుతున్న సెట్కూరు సీఈవో డాక్టర్‌ వేణుగోపాల్‌

· సెట్కూరు సీఈవో డాక్టర్‌ వేణుగోపాల్‌

ఆత్మకూరు, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సెట్కూరు సీఈవో డాక్టర్‌ వేణుగోపాల్‌ సూచించా రు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మత్తు పదార్థాల వ్యస నం - పర్యవసానాలు, సైబర్‌ క్రైం అనే అంశాలపై సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొగాకు, గంజా యి తదితర మత్తు పదార్థాల వల్ల తీవ్ర దుష్పలితాలు ఉంటాయన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగించేవారిలో యువత ఎక్కువగా ఉన్నారని, దీనివల్ల యువత భవిష్యత అంధకారం కానుందని వివరించారు. సరదాగా మొదలయ్యే ఈ అలవాటు జీవితాలను నాశనం చేస్తుందన్న విషయాన్ని యువత గుర్తించుకోవాలని సూచించారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాల విక్రయాలు జరిగితే డయల్‌ 100 లేదా మాదక ద్రవ్యాల కంప్లైంట్‌ ప్రత్యేక నంబర్‌ 1972కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అపరిచిత ఫోనకాల్స్‌, మేసేజ్‌లు, లింక్‌ల జోలికి వెళ్లవద్దని తెలిపారు. ప్రత్యేకించి సోషల్‌ మీడియాను అవసరానికి మాత్రమే వినియోగించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సెట్కూరు పర్యవేక్షకులు శ్యాంబాబు, కళాశాల ప్రిన్సిపల్‌ సుంకన్న, అధ్యాపకులు ఉన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 11:18 PM