ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:03 AM
మండలంలోని దామగట్ల గ్రామంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీలు సోమవారం ముగిశాయి.
నందికొట్కూరు రూరల్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని దామగట్ల గ్రామంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీలు సోమవారం ముగిశాయి. పోటీలు హోరాహోరీగా సాగాయి. బాపట్లకు చెందిన మహిళా కబడ్డీ జట్టు ప్రథమ స్థానంలో నిలిచి రూ 30,016 నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందుకుంది. అలాగే ద్వితీయ స్థానంలో కృష్ణా జిల్లా జట్టు నిలిచి రూ. 20,016 ప్రశంసాపత్రం, తృతీయ స్థానంలో కర్నూలు మహిళా జట్టు గెలుపొంది రూ 10,016 ప్రశంసా పత్రం, నాలుగవ స్థానంలో కడప జిల్లా జట్టు నిలిచింది. విజేతలకు ఐఆర్‌ఎస్ వేల్పు ల ఆనంద్, సీఐ సుబ్రహ్మణ్యం, జిల్లా ఫైర్ ఆఫీసర్ డీ ఏసురత్నం, సర్పంచ మాదవరం సుశీలమ్మ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ డీఎస్పీ జయచంద్ర, రిటైర్డ్ హెచఎం ఆర్థర్ చార్లెస్ జాన, మాదవరం ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.