పాఠశాలల విలీనం తగదు: ఎస్‌టీయూ
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:00 AM
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేయాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని...
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేయాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్‌టీయూ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఐదుగురు కంటే తక్కువ విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు, 30 కంటే తక్కువ ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు, 50 కంటే తక్కువ మంది ఉన్న ఉన్నత పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రతిపాదనలు కోరుతున్నారని తెలిపింది. రాష్ట్రంలో ఒక్క పాఠశాలను కూడా మూసివేయబోమని హామీ ఇచ్చి ఇప్పుడు అందుకు విరుద్ధంగా విలీనం ప్రతిపాదన చేయడం సరికాదని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్.సాయి శ్రీనివాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.