Share News

Urban Canteens: అన్న క్యాంటీన్లకు సలహా కమిటీలు

ABN , Publish Date - Nov 29 , 2025 | 04:43 AM

పట్టణాల్లోని అన్న క్యాంటీన్ల నాణ్యతను పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయి సలహా సంఘంతో పాటు ఆయా క్యాంటీన్లవారీగా సలహా కమిటీలను ని యమిస్తూ మున్సిపల్‌...

Urban Canteens: అన్న క్యాంటీన్లకు సలహా కమిటీలు

  • కమిటీ చైర్‌పర్సన్‌గా కార్పొరేటర్‌ లేక కౌన్సిలర్‌

  • ఆహార నాణ్యత, పరిసరాల శుభ్రతపై దృష్టి

  • వారానికి రెండు రోజులు క్యాంటీన్ల తనిఖీ

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): పట్టణాల్లోని అన్న క్యాంటీన్ల నాణ్యతను పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయి సలహా సంఘంతో పాటు ఆయా క్యాంటీన్లవారీగా సలహా కమిటీలను ని యమిస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కమిటీకి చైర్‌పర్సన్‌గా మునిసిపాలిటీ కార్పొరేటరు/కౌన్సిలరు (మునిసిపాలిటీ చైర్మన్‌ లేక జిల్లా ఇన్‌చార్జి మంత్రి నియమిస్తారు), సభ్యులుగా వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ, వార్డు ఉమెన్‌ అండ్‌ వీకర్‌ సెక్షన్స్‌ ప్రొటెక్షన్‌ సెక్రటరీ, స్థానిక స్వచ్చంధ సంస్థ ప్రతినిధి, స్వయం సహాయక సంఘం ప్రతినిధి, సభ్య కన్వీనర్‌గా అన్న క్యాంటీన్ల నోడల్‌ అధికారిని నియమించాలంటూ ఆదేశాలిచ్చారు. వారంలో రెండు రోజులు ఈ కమిటీ అన్న క్యాంటీన్లను తనిఖీ చేస్తుంది. వంటగదిని, భోజన తయారీ విధానాన్ని పరిశీలిస్తుంది. వడ్డించే కౌంటర్లు, డైనింగ్‌ ప్రాంతం, చెత్త నిర్వహణ, ఆహార నిల్వ ఏర్పాట్లు మున్సిపల్‌ ఆరోగ్య ప్రమాణాల ప్రకారం ఉన్నాయా? లేదా అనేది కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీలోని ఒక సభ్యుడు రోజూ అక్కడి భోజనం నాణ్యతను పరిశీలిస్తారు.

అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ నిర్వహణకు నోడల్‌ ఏజెన్సీ

కేంద్రం మంజూరు చేసిన అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ నిర్వహణకు నోడల్‌ ఏజెన్సీగా ఏపీయూఎ్‌ఫఐడీసీ ని (ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) నియమిస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులిచ్చింది. బ్యాంకబుల్‌ ప్రాజెక్టుల వ్యయంలో 25శాతం వరకు నిధులను అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ ద్వారా, 50 శాతం బాండ్లు, బ్యాంకు రుణాల ద్వారా సమకూరితే, పీపీపీల ద్వారా మిగిలిన 25శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ ఏడాది జూలై నుంచి 37 అదనపు కేంద్ర ప్రాయోజిత పథకాలను అన్ని రాష్ట్రాలు ‘స్పర్శ’ ద్వారా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ కూడా ఉంది.

Updated Date - Nov 29 , 2025 | 04:43 AM