ప్రారంభమైన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:23 PM
కర్నూలు నగరంలోని జోహరాపురంలో 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ (అండర్-17 బాలబాలికలు) కబడ్డీ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించండి : డీఈఓ శామ్యూల్‌పాల్
కర్నూలు స్పోర్ట్స్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలోని జోహరాపురంలో 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ (అండర్-17 బాలబాలికలు) కబడ్డీ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్, విద్యావేత్త కేవీ సుబ్బారెడ్డి 18వ వార్డు కౌన్సిలర్ పద్మలతరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి విజేతలు కావాలన్నారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. కర్నూలు జిల్లాలో కబడ్డీ క్రీడకు మంచి గుర్తింపు ఉందన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం స్కూల్‌గేమ్స్ స్పోర్ట్స్ ప్లాగ్ ఆవిష్కరించారు. 13 జిల్లాల క్రీడాకారులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కర్నూలు, నెల్లూరు జట్ల కబడ్డీ మ్యాచను డీఈఓ టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ నిర్వహక కార్యదర్శి టి.కృష్ణ, కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ తిమోజీ, కరస్పాండెంట్ సోలేమాన, సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు పాణ్యం గోపి జోహరాపురం వెంకటేశ్వర్లు, కోచ ఆనంద్, పోటీల పర్యవేక్షకులు బి.ప్రవీణ్ (నెల్లూరు) టి.లక్ష్మి కుమారి (అనంతపురం), న్యాయవాది రామశేషన్న, శేషిరెడ్డి, పుల్లన్న, కర్ణ, హరిప్రసాద్, పాణ్యం కరుణాకర్ రెడ్డి, తదితర వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.