న్యాయవాదుల కుటుంబాలకు 46 కోట్ల సాయం: మంత్రి ఫరూక్
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:17 AM
రాష్ట్ర వ్యాప్తంగా 2020 ఏప్రిల్ నుంచి మరణించిన 1150మంది న్యాయవాదుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు కూటమి ప్రభుత్వం రూ.46 కోట్ల...
అమరావతి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా 2020 ఏప్రిల్ నుంచి మరణించిన 1150మంది న్యాయవాదుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు కూటమి ప్రభుత్వం రూ.46 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్‌ను మంజూరు చేసినట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నిధులను ఏపీ అడ్వకేట్స్ సంక్షేమ నిధి ఖాతాకు జమ చేస్తామని తెలిపారు. మరణించిన ఒక్కో న్యాయవాది కుటుంబానికి న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ఇచ్చే మొత్తానికి అదనంగా.. ప్రభుత్వం తరఫున పరిహార భాగంగా రూ.4లక్షల చొప్పున వారి నామినీలకు అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.