Mining Approvals: గనుల అనుమతులకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 06:36 AM
రాష్ట్రంలో గనుల లీజులకు పలు శాఖల అనుమతులు కావాలి. వాటిని సకాలంలో పొందేందుకు, పనులను సమన్వయంతో సాధించడానికి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను...
అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గనుల లీజులకు పలు శాఖల అనుమతులు కావాలి. వాటిని సకాలంలో పొందేందుకు, పనులను సమన్వయంతో సాధించడానికి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పా టు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర స్థా యి కమిటీలో గనుల శాఖ కార్యదర్శి, పర్యావరణ, అటవీశాఖ, పరిశ్రమలు, రెవెన్యూ శాఖ కార్యదర్శులు, కాలుష్య నియంత్రణ మండలం సభ్య కార్యదర్శి, సియా సభ్య కార్యదర్శి, ప్రధాన అటవీ సంరక్షణాధికారి(పీసీసీఎఫ్), గనుల శాఖ డైరెక్టర్, ఇంకా న్యాయ నిపుణులు, ఆయా విభాగాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఇక జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీకి కలెక్టర్ చైౖర్మన్‌గా ఉంటారు.