Share News

AP High Court: స్టాండింగ్‌ కౌన్సిళ్ల నియామకం

ABN , Publish Date - Nov 06 , 2025 | 05:55 AM

హైకోర్టులో వివిధ ప్రభుత్వ సంస్థలు, వర్సిటీల తరఫున వాదనలు వినిపించేందుకు పలువురు న్యాయవాదులు స్టాండింగ్‌ కౌన్సిళ్లుగా నియమితులయ్యారు.

 AP High Court: స్టాండింగ్‌ కౌన్సిళ్ల నియామకం

ఇంటర్నెట్ డెస్క్: హైకోర్టులో వివిధ ప్రభుత్వ సంస్థలు, వర్సిటీల తరఫున వాదనలు వినిపించేందుకు పలువురు న్యాయవాదులు స్టాండింగ్‌ కౌన్సిళ్లుగా నియమితులయ్యారు. ఏపీ హ్యాండీక్రాఫ్ట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ తరఫున న్యాయవాది బసు నాంచారయ్య నాయుడు, ఏపీ స్పోర్ట్స్‌ అథారిటీ తరఫున జి.సాయి నారాయణరావు, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ తరఫున ఎం.శివకుమార్‌, శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ తరఫున వల్లభనేని శాంతి శ్రీ, రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఏపీ ఆశ్రమ పాఠశాలల సొసైటీ, ఏపీ గిరిజన సంక్షేమ, ఏపీ సాంఘిక సంక్షేమ, ఏపీ బీసీ సంక్షేమ ఆశ్రమ పాఠశాలల సొసైటీల తరఫున తర్లాడ వినోద్‌కుమార్‌ స్టాండింగ్‌ కౌన్సిళ్లుగా నియమితులయ్యారు.

Updated Date - Nov 06 , 2025 | 05:57 AM