Share News

తొక్కిసలాట కలచివేసింది: పవన్‌ కల్యాణ్‌

ABN , Publish Date - Nov 02 , 2025 | 06:09 AM

కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కి సలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

తొక్కిసలాట కలచివేసింది: పవన్‌ కల్యాణ్‌

అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కి సలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కార్తిక ఏకాదశి సంద ర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాట మూలంగా తొమ్మిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. ఈ విషాదకర ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొం టుంది. ఆలయాల్లో క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవదాయ శాఖ అఽధికారులకు సూచిస్తున్నాం. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలి’ అని పవన్‌ పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస, నిమ్మక జయకృష్ణ, లోకం మాధవి పరామర్శించి ఓదార్చాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.

Updated Date - Nov 02 , 2025 | 06:11 AM