శ్రీశైలం డ్యాం గేట్లు మూసివేత
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:45 AM
శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్‌గేట్లను మంగళవారం రాత్రి ఇంజనీర్లు మూసివేశారు. ఎగువ పరివాక ప్రాంతాలైన జూరాల, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సుంకేసుల నుంచి మొత్తం 1,11,883 క్యూసెక్యుల నీరు వచ్చి చేరుతోంది.
శ్రీశైలం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్‌గేట్లను మంగళవారం రాత్రి ఇంజనీర్లు మూసివేశారు. ఎగువ పరివాక ప్రాంతాలైన జూరాల, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సుంకేసుల నుంచి మొత్తం 1,11,883 క్యూసెక్యుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యాం నీటిమట్టం బుధవారం సాయ్రంతం 6గంటల సమయానికి 883 అడుగులుగా ఉండగా నీటినిల్వ సామర్థ్యం 205 టీఎంలుగా నమోదు అయింది. శ్రీశైలం రెండు విద్యుత క్రేందాల్లో ఉత్పత్తి అనంతరం 66,568 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు.