Share News

New Advisors to Andhra Pradesh Government: సరికొత్త సలహాదారులు శ్రీధర్‌, మంతెన, చుండూరిలకు పదవులు

ABN , Publish Date - Dec 30 , 2025 | 04:34 AM

రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మాస్‌ కమ్యూనికేషన్స్‌)గా ప్రముఖ కార్టూనిస్టు పోచంపల్లి శ్రీధరరావు....

New Advisors to Andhra Pradesh Government: సరికొత్త సలహాదారులు శ్రీధర్‌, మంతెన, చుండూరిలకు పదవులు

అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మాస్‌ కమ్యూనికేషన్స్‌)గా ప్రముఖ కార్టూనిస్టు పోచంపల్లి శ్రీధరరావు (కార్టూనిస్ట్‌ శ్రీధర్‌)ను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. శ్రీధర్‌తోపాటు యోగా, నేచురోపతి సలహాదారుగా ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణరాజును నియమించా రు. చుండూరి సీతారామాంజనేయప్రసాద్‌ను రాష్ట్ర ప్రభుత్వ దేవదాయ సలహాదారుగా నియమించారు. కాగా, కీలకమైన ఈ జీవోల విడుదలలో జీఏడీ అధికారులు గందరగోళం చేశారు. తొలుత చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్‌ను మాస్‌ కమ్యూనికేషన్స్‌ సలహాదారుగా, పోచంపల్లి శ్రీధర్‌రావును దేవదాయ సలహాదారుగా పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పొరపాటును గ్రహించి మార్పులతో ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Dec 30 , 2025 | 04:34 AM