వైభవంగా శ్రీరామపట్టాభిషేకం
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:36 AM
సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం బందరుకోట కోదండ రామాలయంలో జరిగిన నారాయణ హోమం ముగిసిన సందర్భంగా జరిగిన పూర్ణాహుతిలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆ యన కుమారుడు పునీత్‌తోపాటు పలువురు భక్తు లు పాల్గొన్నారు.
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం బందరుకోట కోదండ రామాలయంలో జరిగిన నారాయణ హోమం ముగిసిన సందర్భంగా జరిగిన పూర్ణాహుతిలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆ యన కుమారుడు పునీత్‌తోపాటు పలువురు భక్తు లు పాల్గొన్నారు. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను వైభవంగా అలంకరించారు. సహస్ర నామాలతో స్వామివారికి, అమ్మవారికి అర్చనలు జరిపారు. మా జీ కౌన్సిలర్ బచ్చుల అనిల్‌కుమార్, జిల్లా మత్స్యకారుల సంఘ అధ్యక్షుడు కొక్కిలిగడ్డ నాగరమేష్, కరగ్రహారం మాజీ సర్పంచ్ నాగుల్‌మీరా పాల్గొన్నారు.
వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
స్థానిక బచ్చుపేటలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈవో సమ్మెట ఆంజనేయ స్వామి ఉత్సవాలను ప్రారంభించారు.
భావదేవరపల్లిలో శ్రీరామపట్టాభిషేకం
నాగాయలంక: ధర్మ పరిరక్షణకు పాటుపడటమే శ్రీరామ పట్టాభిషేకం పరమార్థమని ఎమ్మెల్యే మం డలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం నాగాయలంక మండలంలోని భావదేవరపల్లిలో శ్రీరామాలయంలో రాముల వారి పట్టాభిషేక మహోత్సవం వై భవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తాత మండలి వెంకట్రామయ్య ఆధ్యాత్మిక వారసత్వాన్ని తమ్ముడు ఉదయభాస్కర్ కొనసాగిస్తూ శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, ఈ ఏడాది పట్టాభిషేకంలో పాల్గొనటం ఆనందదాయకమన్నారు. మండలి బుద్ధప్రసాద్ సోదరుడు మండలి సత్యప్రసాద్, జనసేన నేతల మండ లి వెంకట్రామ్ రాముల వారి ఊరేగింపు సందర్భంగా పల్లకీ సేవ చేశారు. సర్పంచ్ మండలి ఉదయభాస్కర్ - స్వర్ణ దంపతులు, మండలి వెంకట్రా మ్ - కృష్ణవేణి దంపతులు, వెంకట కాళేశ్వరరావు - విజయలక్ష్మి దంపతులు పాల్గొని పట్టాభిషేకం జరిపించారు. అనంతరం అచ్చిరెడ్డి ముఠా, కృష్ణారెడ్డి ముఠా, బండ్రెడ్డి ముఠా, బావిరెడ్డి ముఠా పర్యవేక్షణలో జరిగిన భారీ అన్నసమారాధనను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు.
వి.రుద్రవరం గ్రామంలో..
ఘంటసాల,: మండల పరిధిలోని వి.రుద్రవరం గ్రామంలోని రామాలయం వద్ద సీతారాముల పట్టాభిషేక మహోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. సర్పంచ్ వెనిగళ్ల రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి పట్టాభిషేక మహోత్సవ ఊరేగింపునకు సంబంధించి బండి పాటను రూ.31,011కు వేలంపాటలో పాడినట్టు తెలిపారు. సర్పంచ్ రామకృష్ణ ప్రసాద్, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో సీతారాముల ఉత్సవమూర్తులతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం అన్నసమారాధన జరిగింది.
రామాలయానికి ఎమ్మెల్యే కాగిత శంకుస్థాపన
పెడన రూరల్: మండలంలోని బల్లిపర్రు శివారు గ్రామమైన శింగరాయపాలెంలో నూతన రామాలయ నిర్మాణంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొని పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. కాలనీలో ఏర్పాటు చేయనున్న రామాలయానికి గ్రామస్థుల సహకారంతో నిర్మిస్తున్నారు. సర్పంచి జోగి నాగ వరలక్ష్మి, జడ్పీటీసీ అర్జా నగేష్, శలపాటి ప్రసాద్, శీరం ప్రసాద్, జోగి వెంకటరమణ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
భారీగా అన్న సమారాధన
అవనిగడ్డ రూరల్: మండల పరిధిలోని అశ్వారావుపాలెంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సోమవారం అన్నసమారాధన నిర్వహించారు. దాదాపు 4వేల మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. అలాగే వేకనూరు శివారు గుడివాకవారిపాలెంలో అన్నసమారాధన నిర్వహించగా, 1500 మంది భక్తులు పాల్గొన్నారు. కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు.