AP Secretariat: సచివాలయంలో ఎస్పీఎఫ్ సిబ్బందికి ఆటల పోటీలు
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:13 AM
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విజయవాడ జోన్ స్పోర్ట్స్ మీట్ శుక్రవారం జరిగింది.
అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విజయవాడ జోన్ స్పోర్ట్స్ మీట్ శుక్రవారం జరిగింది.వాలీబాల్,బాడ్మింటన్ పోటీలను ఏపీఎస్పీఎఫ్ డీజీ త్రివిక్రమవర్మ,ఐజీ రామిరెడ్డి ఆదేశాలతో విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకరరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ ఆటల పోటీలు దైనందిన జీవితంలో ఒత్తిడిని తగ్గిస్తాయని,వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయని చెప్పారు.రాష్ట్ర సచివాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పీవీఎస్ఎన్ మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆటలు సమష్టి కృషిని,మానసిక,శారీరక దృఢత్వాన్ని పెంపొదిస్తాయని అన్నారు. విజయవాడ జోన్‌లోని ఏపీ సెక్రటేరియేట్, ఏపీ హైకోర్టు, విజయవాడ గాడ్స్,ఇబ్రహీపట్నం ఎన్టీపీఎస్, గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఎస్పీఎఫ్ సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.