కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:54 PM
కల్తీ మద్యంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని నగర మేయర్ బీవై రామయ్య ఆరోపించారు.
ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ నిరసన
కర్నూలు అర్బన్ , అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కల్తీ మద్యంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని నగర మేయర్ బీవై రామయ్య ఆరోపించారు. నగరంలోని జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మద్యం బాటిళ్లతో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో నిరసన చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా ఎక్కడో సరిహద్దులోని ములకల చెరువులో బయట పడ్డ టీడీపీ నాయకుల కల్తీ ఫ్యాక్టరీ లింకులు, తర్వాత విజయవాడలో బయట పడ్డయని అన్నారు. జరిగిన ఘటనలు అన్నింటినీ పరిశీలిస్తే ఈ మాఫియా ఎంత విస్తారంగా ఉందో తెలుస్తోందన్నారు. ఇలాంటి వ్యవహాల్లో ఆరితేరిన టీడీపీ వర్గీయులు పకడ్బందీగా దీన్ని నడుపుతున్నారని మండి పడ్డారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, మండలాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.