Share News

ప్రాణాలు తీసిన అతివేగం

ABN , Publish Date - Jul 27 , 2025 | 12:57 AM

వేగంగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందగా, ఓ యువకుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన బంటుమిల్లి మండలం పెందుర్రు గ్రామం వద్ద 216 జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగింది.

ప్రాణాలు తీసిన అతివేగం

- ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకుల మృతి

- బంటుమిల్లి మండలం పెందుర్రు గ్రామం వద్ద ఘటన

బంటుమిల్లి, జూలై 26(ఆంధ్రజ్యోతి): వేగంగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందగా, ఓ యువకుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన బంటుమిల్లి మండలం పెందుర్రు గ్రామం వద్ద 216 జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కృత్తివెన్ను మండలం అడ్డపర్రు గ్రామానికి చెందిన నైండ్రు నరేష్‌(25) బంటుమిల్లి నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఏపూరు గ్రామానికి చెందిన చెరుకుమిల్లి శివకుమార్‌ (25), గుర్రం పవన్‌కుమార్‌ యానం నుంచి హనుమాన్‌ జంక్షన్‌ బయలు దేరారు. పెందుర్రు శివారు 216 జాతీయ రహదారిపై మిలేష్‌ కంపెనీ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు బైక్‌లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏపూరుకు చెందిన చెరుకుమిల్లి శివకుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. నైండ్రు నరేష్‌, గుర్రం పవన్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నైండ్రు నరేష్‌ మృతి చెందాడు. పవన్‌కుమార్‌ పరిస్థితి విషమంగా ఉంది. బంటుమిల్లి ఎస్సై గణేష్‌కుమార్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Updated Date - Jul 27 , 2025 | 12:57 AM