CII Summit in Visakhapatnam: అలా ఒప్పందాలు..ఇలా ఉత్తర్వులు
ABN , Publish Date - Nov 15 , 2025 | 07:00 AM
కూటమి ప్రభుత్వానిది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ధీమాగా చెబుతుంటారు.
ఇదీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. లోకేశ్ సమక్షంలో 17 సంస్థలతో ఎంవోయూలు
27,900 కోట్ల పెట్టుబడులు.. 53,879 ఉద్యోగాలు
విశాఖ వేదికగా స్పష్టమైన ప్రభుత్వ పారిశ్రామిక విధానం
విశాఖపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వానిది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ధీమాగా చెబుతుంటారు. ఇవి మాటలు కావని విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో నిరూపించారు. శుక్రవారం లోకేశ్ సమక్షంలో 17 ప్రముఖ సంస్థలతో రూ.27,900కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. వీటివల్ల 53,879 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అవగాహనా ఒప్పందాలు జరిగిన వెంటనే అక్కడికక్కడే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి, సంబంధిత సంస్థల యాజమాన్యాలకు అందజేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం మరీ ఇంత స్పీడుగా ఉంటుందని అనుకోలేదని పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యపోయారు.
లోకేశ్ సమక్షంలో జరిగిన ఎంఓయూలు
ఎస్పీఐసీ వెంచర్స్ ఎల్‌ఎల్‌పీ సంస్థ తిరుపతి జిల్లాలో రూ.1704 కోట్లతో మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఐటీ అండ్ క్లోజర్స్ పీసీబీఏ అండ్ సీసీబీ బేర్ బోర్డ్స్ ద్వారా 2,630 మందికి ఉపాధి కల్పించనున్నారు. రాష్ట్ర ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఉత్తర్వును సంస్థ డైరెక్టర్ అన్షుమన్ ఎన్నిగళ్లకు లోకేశ్ అందజేశారు.
సిర్నా ఎస్టీఎస్ లిమిటెడ్ సంస్థ తిరుపతి జిల్లాలో రూ.1595 కోట్లతో మాన్యుఫాక్చరింగ్ అఫ్ పీసీబీ అండ్ కాపర్ గ్లాడ్ లామినేట్ ప్రాజెక్టు ద్వారా 1894 మందికి ఉపాధి కల్పించనుంది. ఐటీ శాఖ ఈ ఒప్పందం ఉత్తర్వు జారీ చేసింది.
ఎపిటోమ్ కాంపౌనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుపతి జిల్లాలో రూ.700 కోట్లతో మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ మల్టీలేయర్ పీసీబీ ప్రాజెక్టు స్తాపించేందుకు ఒప్పందం చేసుకుంది.
చిత్తూరు జిల్లాలో హిందాల్కో ఇండస్ట్రీ్ట్రస్ లిమిటెడ్ రూ.586 కోట్లతో మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ మొబైల్ చాసిస్ ప్రాజెక్టును స్థాపించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
తిరుపతి జిల్లాలో సోలం ఇండియా హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.268 కోట్లతో మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఈవీ కాంపోనెంట్స్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది.
తిరుపతి జిల్లాలో ఈమాక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.11,000 కోట్లతో మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ కన్జ్యూమర్ అండ్ ఆటోమేటిక్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
తిరుపతి జిల్లాలో డైకిన్ ఎయిర్ కండీషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.2500 కోట్లతో మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఏసీ అండ్ ఇట్స్ కాంపౌనెంట్స్ విస్తరణకు ఒప్పందం.
ఎన్‌పీఎపీఎల్ స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్ర వ్యాప్తంగా 2400 కోట్లతో మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ క్యాథోడ్ మెటీరియల్ ఇన్ బ్యాటరీ సెట్ ఏర్పాటుకు ఒప్పంది.
తిరుపతి జిల్లాలో ఎపాక్ గ్రూప్ సంస్థ రూ.4,116 కోట్లతో మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఏసీ అండ్ ఇట్స్ కాంపౌనెంట్స్ అండ్ ప్రీఫాబ్ మెటీరియల్స్ ఏర్పాటుకు ఒప్పందం.
తిరుపతి జిల్లాలో నియో లింక్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1150 కోట్లతో ఎలక్ట్రానిక్స్ కాంపౌనెంట్స్ తయారీ, కెమెరా కాంపౌనెంట్స్, మొబైల్ ఎన్‌క్లోజర్స్ అండ్ ఎలకోట్ర మెకానికల్ ఐటమ్స్ సంస్థల ఏర్పాటుకు ఒప్పందం.
తిరుపతి జిల్లాలో సీస్పాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1400 కోట్లతో పీసీబీ ప్రాజెక్టు స్థాపించేందుకు ఒప్పందం.
రాష్ట్రవ్యాప్తంగా సంవర్ధన మదర్ సన్ ఇంటర్నేషనల్ రూ.1100 కోట్లతో ఆటోమోటివ్ కాంపౌనెంట్స్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఒప్పందం.
తిరుపతి జిల్లాలో డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా రూ.1000 కోట్లతో ఎలకా్ట్రనిక్స్ మాన్యుఫాక్చరింగ్ గూడ్స్ తయారీ సంస్థ ఏర్పాటుకు ఒప్పందం..
తిరుపతి జిల్లాలో అంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా రూ.400 కోట్లతో ఏసీ అండ్ ఇట్స్ కాంపౌనెంట్స్ తమారీ పరిశ్రమ ఏర్పాటు.
తిరుపతి జిల్లాలో మీనా సర్క్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించే పీసీబీ ప్రాజెక్టులో 819 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
విశాఖలో రిఫైబ్స్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.350 కోట్లతో ప్రాసెసింగ్ ఆఫ్ క్రిటికల్ మెటీరియల్స్ ఫ్రమ్ ఈవేస్ట్ ప్రాజెక్టు ఏర్పాటు.
ఎన్టీఆర్ జిల్లాలో టైటాన్ ఇంటెక్ లిమిటెడ్ రూ.250 కోట్లతో ఏర్పాటు చేసే డిస్‌ప్లే ప్యానల్ తయారీ సంస్థలో 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
ప్రత్యేక ఆకర్షణగా ‘ప్రజా రాజధాని’ స్టాల్
విశాఖపట్నం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): సీఐఐ పెట్టుబడిదారుల సదస్సు ప్రాంగణంలో ప్రజారాజధాని అమరావతి విశిష్టతపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏపీసీఆర్‌డీఏ దీనిని ఏర్పాటు చేసింది. సదస్సుకు హాజరైన రాష్ట్ర, దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు రాజధాని అమరావతి విశిష్టత, ప్రత్యేకతలను సీఆర్‌డీఏ కమ్యూనికేషన్ మేనేజర్ రుచి వివరించడం ఆకట్టుకుంది. స్టాల్‌ను సందర్శించే వారికి అమరావతికి సంబంధించిన
ఏపీలో ప్రపంచస్థాయి కన్వెన్షన్ సెంటర్
విశాఖ సీఐఐ సదస్సులో కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్
విశాఖపట్నం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): వాణిజ్య ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, సదస్సులకు వీలుగా ఢిల్లీలో ఉన్న భారత్ మండపంలాగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రపంచస్థాయి కన్వెన్షన్ సెంటర్ ‘ఆంరఽధా మండపం’ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు కేవలం ఆంధ్రప్రదేశ్ గురించే కాకుండా యావత్ దేశం అభివృద్ధి గురించి ఆలోచిస్తారని ప్రశంసించారు. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పీయూష్ గోయల్ మాట్లాడారు. ‘‘గ్లోబల్ ట్రేడ్ గేట్‌వేగా విశాఖ నిలుస్తోంది. 2047 స్వర్ణాంధ్ర విజన్‌తో ఏపీ ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతమవుతుంది. స్వేచ్ఛా వాణిజ్యం కోసం వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుని దానికనుగుణంగా వాణిజ్య బంధాలను బలోపేతం చేస్తున్నాం. దీనికోసం ప్రస్తుతం అమెరికా, యూరోపియన్ యూనియన్, న్యూజిల్యాండ్, ఒమన్, పెరు, చిలీ తదితర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈజ్‌ఆఫ్ డూయింగ్‌ను ప్రోత్సహించడానికి 42వేల సమ్మతి నిబంధనలు కేంద్రం తొలగించింది. 1500 చట్టాలను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా 30 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులతో సెమీ కండక్టర్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. సీఐఐ సదస్సులతో సరికొత్త పెట్టుబడులు, ఆలోచనలు, ఆవిష్కరణలు రావడం అభినందనీయం. ప్రధాని మోదీపై ప్రజలు విశ్వాసంగా ఉన్నారనడానికి బిహార్ ఎన్నికలే నిదర్శనం’ అని గోయల్ పేర్కొన్నారు. ప్రపంచస్థాయి కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.