Share News

Tirumala: కనులపండువగా శ్రీవారి స్వర్ణరథోత్సవం

ABN , Publish Date - Sep 30 , 2025 | 04:54 AM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం సాయంత్రం స్వర్ణరథోత్సవం కన్నులపండువగా జరిగింది.

Tirumala: కనులపండువగా శ్రీవారి స్వర్ణరథోత్సవం

తిరుమల, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం సాయంత్రం స్వర్ణరథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఉత్సవర్లు 4 గంటలకు ఆలయం నుంచి ఊరేగింపుగా స్వర్ణకాంతులతో మెరిసిపోతూ బంగారురథంలో ఆశీనులయ్యారు. 5.10 గంటల వరకు స్వర్ణరథంపై విహరించిన దేవదేవులను భక్తులు దర్శించి ఆనందపరవశులయ్యారు. ఈ స్వర్ణరథాన్ని స్త్రీలు మాత్రమే లాగడం విశేషం. అప్పుడప్పుడు భద్రతా సిబ్బంది కూడా సహకరించగా...ప్రశాంతంగా ముగిసింది. ఇక, ఉదయం స్వామివారు కోదండరాముడిగా హనుమంత వాహనంపై, పట్టాభిషేకానికి వెళ్లే రారాజులా రాత్రి గజవాహనంపై ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు.

Updated Date - Sep 30 , 2025 | 04:55 AM