వేసవిలో ప్రత్యేక రైలు
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:47 PM
వేసవిలో రద్దీ నియంత్రణకు గుంతకల్లు మీదుగా వీక్లి ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటనలో తెలిపారు.

మద్దికెర, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): వేసవిలో రద్దీ నియంత్రణకు గుంతకల్లు మీదుగా వీక్లి ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇప్పటి నుంచి ప్రతి శనివారం మే 10వ తేదీ వరకు హుబ్లీ, వారణాసికి రైలు నెం.07323 ఉంటుదన్నారు. తిరుగు ప్రయాణం రైలు ఈ నెల 8 నుంచి మే 13వ వరకు ప్రతి మంగళవారం నడపనున్నట్లు తెలిపారు. ఈ రైలు హవేరీ, రాణి బెంగుళూరు, హరిహార్, దేవనగిరి, జిగ్‌జాగుర్, కడూర్, హర్సికెర, టోంకూరు, ఎల్లంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, కృష్ణా, బేగంపేట, సికింద్రాబాబు, ఖాజీపేట, జున్నుకుంట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, బాలచంద్రాపూర్, నాగ్‌పూర్, ఆమ్లా, భేతూర్, హిటాచీ, జంబ్లపూర్, పాట్నా, మానిక్‌పూర్, ప్రయగరాజ్ చౌకీ, మీర్జాపూర్ స్టేషన మీదుగా వెళ్తుందని వివరించారు. అలాగే హుబ్లీ, ఖటీహర్ మీదుగా ప్రత్యేక రైలు.నెం.07325 ఈ నెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతి బుధవారం ఉంటుదన్నారు. తిరుగు ప్రయాణం రైలు.నెం.07326ను ఈ నెల 12 నుంచి మే 3వ తేదీ వరకు ప్రతి శనివారం నడుపనున్నట్లు తెలిపారు. ఈ రైలు గదక్, కొప్పల్, హోస్పేట్, తోర్నగల్లు, బళ్లారి, గుంతకల్లు, డోన, నంద్యాల, దిగువమెట్ట, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రాహ్మణపూర్, బోలాపూర్, శాంతినికేతన స్టేషన మీదుగా నడుస్తుందని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.