పంచమఠాల్లో ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:44 PM
శ్రీశైల క్షేత్రంలో ప్రధాన దేవాలయానికి ఉపాలయాలుగా ఉండే ఘంటామఠం, భీమశంకర మఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధార పంచమఠాలలో కొలువైన్న పురాతన శివలింగాలకు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఈవో శ్రీనివాస రావు తెలిపారు.
స్వామి అమ్మవార్లకు సహస్ర దీపార్చన
వెండి రథంపై ఆది దంపతులు
శ్రీశైలం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైల క్షేత్రంలో ప్రధాన దేవాలయానికి ఉపాలయాలుగా ఉండే ఘంటామఠం, భీమశంకర మఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధార పంచమఠాలలో కొలువైన్న పురాతన శివలింగాలకు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఈవో శ్రీనివాస రావు తెలిపారు. అదేవిధంగా సాయంత్రం ప్రధాన ఆలయానికి కుడి వైపు పురాతన రాతిమండపంలో స్వామి అమ్మవార్లను ఊయలలో ఆశీనుల చేసి షోడశోపచార పూజలు నిర్వహించిన తరువాత అర్చక వేదపండితులు సహస్ర దీపాలను వెలిగించారు. అనంతరం వెండి రథంలో ఆశీనులైన స్వామిఅమ్మవార్లకు పుష్పార్చనలు చేసి ఆలయ ప్రదక్షిణలు చేశారు. దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్య లో యాత్రికులు, నిత్య కళ్యాణ దాతలు వెండి రథోత్సవంలో పాల్గొన్నారు.