Share News

కన్నెతీర్థంలో ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:59 PM

మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కన్నెతీర్థంలో ఆదివారం ఆషాఢమాసం శుద్ధ తొలి ఏకాదశిని పురష్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కన్నెతీర్థంలో ప్రత్యేక పూజలు
జమ్మలమడుగు కన్నెతీర్థంలో హోమం చేస్తున్న దృశ్యం

జమ్మలమడుగు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కన్నెతీర్థంలో ఆదివారం ఆషాఢమాసం శుద్ధ తొలి ఏకాదశిని పురష్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ దేవగుడి శివనాథరెడ్డి ఆధ్వర్యంలో బాలత్రిపుర సుందరీదేవి, సుందరేశ్వరస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యభగవానుడు మిధున రాశి నుంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనంలోకి ప్రారంభం అవుతున్నందున తొలి ఏకాదశిగా పిలువడం జరుగుతుందన్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రొద్దుటూరుకు చెందిన అలివేలమ్మ భక్త బృందం వారు ఛండీ హోమం నిర్వహించారు.

కొండాపురంలో : తొలిఏకాదశి పండుగను మండలంలో ఆదివారం ఘనం గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది.

పోరుమామిళ్లలో : భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి వేడుకలు నిర్వహించారు. ఆదివారం పోరుమామిళ్ల మండలంలో లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. అలాగే బలిజ కోట వీధి సమీపంలో ఉన్న లక్ష్మికాంతస్వామి దేవాలయంలో కాల్వకట్ట వద్ద ఉన్న లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు.

Updated Date - Jul 06 , 2025 | 11:59 PM