Share News

స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:06 AM

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు మూల నక్షత్ర ప్రత్యేక పూజలు వైభవంగా జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
ఆలయంలో పల్లకీసేవ

శ్రీశైలం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు మూల నక్షత్ర ప్రత్యేక పూజలు వైభవంగా జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శనివారం సాయంత్రం మహా గణపతిపూజకు సంకల్పాన్ని పఠించారు. అమ్మవారి ప్రాకార మండపంలో ప్రత్యేక పూలతో అలంకరించిన ఊయలలో స్వామిఅమ్మవార్లను ఆసీనులజేసి షోడశోపచారపూజా క్రతువులను వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలోగల పల్లకిపై స్వామిఅమ్మవార్లను ఆశీనులచేసి పూజలు నిర్వహించి ఆలయ ప్రదక్షిణగా పల్లకిపై ఆదిదంపతులను విహరింపజేశారు. అదేవిధంగా మాడవీధిలో కళారాధన వేదికపై హైదరాబాద్‌కు చెందిన జనయిత్రి నృత్యాలయం వారిచే పలు భక్తి గీతాలకు కళాకారులు సంప్రదాయ నృత్య ప్రదర్శన చేశారు.

Updated Date - Dec 21 , 2025 | 12:06 AM