AP Municipal Administration: 10 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలన గడువు పెంపు
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:30 AM
రాష్ట్రంలో 10 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలన గడువును పెంచుతూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 10 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలన గడువును పెంచుతూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కందుకూరు, ఆమదాలవలస, నరసారావుపేట, పొన్నూరు, కావలి, చింతలపూడి నగర పంచాయతీ, వైఎ్‌సఆర్ తాడిగడప, పొదిలి నగర పంచాయతీ, అల్లూరు నగర పంచాయతీ, బి.కొత్తకోట నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పదవీ కాలం జనవరిలో ముగియనుండటంతో వారి పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు లేక ఎన్నికలు జరిగేవరకు పొడిగిస్తూ మున్సిపల్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.