Share News

వృద్ధుల కోసం ప్రత్యేక చట్టాలు

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:02 AM

పిల్లల నుంచి నిరాధరణకు గురవుతున్న వృద్ధ తల్లిదండ్రులు వారి నుంచి బరణం పొందే చట్టాలు ఉన్నాయని కర్నూలు జిల్లాన్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి అన్నారు.

 వృద్ధుల కోసం ప్రత్యేక చట్టాలు
మాట్లాడుతున్న కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్థి

కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి

నందికొట్కూరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పిల్లల నుంచి నిరాధరణకు గురవుతున్న వృద్ధ తల్లిదండ్రులు వారి నుంచి బరణం పొందే చట్టాలు ఉన్నాయని కర్నూలు జిల్లాన్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి అన్నారు. బుధవారం నందికొట్కూరులోని శ్రీకాళీ ప్రసాద ఆశ్రిత ఆశ్రమంలో నల్సా న్యూమ్యాడ్యుల్‌ అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅథితులుగా జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్థి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి శాశ్వత లోక్‌ అదాలత ఛైర్మన వెంకట హరినాథ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కబర్థి మాట్లాడుతూ తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం 2007 ప్రకారం పిల్లల నుంచి నిరాదరణకు గురైన తల్లిదండ్రులు చట్ట ప్రకారం వారి నుంచి భరణం పొందే హక్కు ఉందన్నారు. ఉచిత న్యాయ సహాయం, విద్యా హక్కు కోసం 1098 హెల్ప్‌ లైన, మహిళా హెల్ప్‌లైన నెంబర్‌ 181, న్యాయ సహాయం కోసం హెల్ప్‌లైన-15100, చైల్డ్‌ లైన హెల్ప్‌ లైన నెంబరు 1098, దివ్యాంగజన హెల్ప్‌ లైన నెంబరు 14456 తదితర అంశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు పల్లె ప్రియాంక సేవా సమితి అధ్యక్షులు రిటైర్‌ జిల్లా న్యాయాధికారి మోహనరావు, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శోభారాణి, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి దివ్య, ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి, మున్సిపల్‌ కమీషనర్‌ బేబి, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, సీఐ ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, మెడికల్‌ ఆఫీసర్స్‌, ఐసీడీఎస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:02 AM