Land Allocation: ఆ కంపెనీలకు 4 ఎకరాలే
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:31 AM
టాప్-100 ఫార్చ్యూన్ కంపెనీల జాబితాలో లేని ద్వితీయ శ్రేణి కంపెనీలకు భూ కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర భూ ప్రోత్సాహక విధానంలో సవరణ తెచ్చిన ఐటీ శాఖ...
టాప్-100 జాబితాల్లో లేని కంపెనీలకు భూకేటాయింపులపై ప్రత్యేక విధానం
అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): టాప్-100 ఫార్చ్యూన్ కంపెనీల జాబితాలో లేని ద్వితీయ శ్రేణి కంపెనీలకు భూ కేటాయింపులకు సంబంధించి ‘రాష్ట్ర భూ ప్రోత్సాహక విధానం’లో సవరణ తెచ్చిన ఐటీ శాఖ దాన్ని క్యాబినెట్ ముందుంచింది. కనీసం రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టగలిగి.. కనిష్ఠంగా 250మందికి ఉద్యోగాలిచ్చి.. ఏడాదిలోగా వాణిజ్య కార్యక్రమాలను చేపడతామంటూ కంపెనీలు లిఖితపూర్వక హామీ ఇవ్వాలి. అప్పుడే ఎకరా రూ.5 కోట్ల వంతున నాలుగెకరాలు కేటాయిస్తామని ప్రతిపాదించింది. భూ కేటాయింపులు జరిగిన ఏడాదిలోగా వ్యాపార కార్యకలాపాలు మొదలుపెట్టకపోయినా.. 250 మందికి ఉద్యోగాలివ్వకపోయినా కేటాయించిన భూమికి మార్కెట్ విలువను వసూలు చేస్తామని ఐటీ శాఖ స్పష్టం చేసింది.