Speaker Ayyanna Patrudu: ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా జగన్‌రెడ్డికి నేనెక్కడ నుంచి తెచ్చిస్తా..
ABN , Publish Date - Nov 11 , 2025 | 06:30 AM
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. నా 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇటువంటి రాజకీయాలు నేనెప్పుడూ చూడలేదు అని స్పీకర్...
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: స్పీకర్ అయ్యన్న
అనపర్తి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ‘వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. నా 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇటువంటి రాజకీయాలు నేనెప్పుడూ చూడలేదు’ అని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తిలోని పార్వతి రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నిర్వహించిన రుద్రయాగ, నవ చండీయాగంలో ఆయన కుటుంబంతో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘మాజీ సీఎం జగన్‌కి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పక్కన పెట్టారు. రాజ్యాంగాన్ని కాదని నేనెక్కడి నుంచి తెచ్చిస్తాను? దేశంలో ఎక్కడా లేని విధంగా 11 సీట్లు వచ్చిన పార్టీ ప్రతిపక్ష హోదా అడగడం విడ్డూరంగా ఉంది. ఎన్నో దేశాలను కాదని గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తుంటే గర్వించాల్సింది పోయి దానిపైనా విమర్శలు చేయడం వారి నైజాన్ని తెలియజేస్తుంది. రాష్ట్రం రాక్షసుల బారిన పడకుండా చూడాలని శివయ్యను కోరుకుని పెడపర్తి యాగంలో పాల్గొన్నా’ అని అయ్యన్న అన్నారు.