Share News

Speaker Chintakayala Ayyanna: స్పీకర్‌ను చేసి నా నోటికి తాళం వేశారు

ABN , Publish Date - Nov 18 , 2025 | 04:26 AM

తనను స్పీకర్‌ను చేసి తన నోటికి తాళం వేశారని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు....

Speaker Chintakayala Ayyanna: స్పీకర్‌ను చేసి నా నోటికి తాళం వేశారు

  • శాసన సభాపతి అయ్యన్న వ్యాఖ్యలు

పెందుర్తి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): తనను స్పీకర్‌ను చేసి తన నోటికి తాళం వేశారని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే బాఽధేస్తోందన్నారు. కొంతమంది పగలు ఓ పార్టీలో, రాత్రికి మరో పార్టీలో ఉంటున్నారని.. ఇదంతా చూస్తూ రాజకీయాల్లో ఎందుకు ఉన్నాననిపిస్తోందని, అయినా నెట్టుకొస్తున్నామని పేర్కొన్నారు. గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పీలా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలకు అయ్యన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు రాజకీయాలు డబ్బుమయం అయ్యాయని, ఊసరవెల్లి నేతలు అధికమయ్యారన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 04:26 AM