మహానందీశ్వరుడి సన్నిధిలో ఎస్పీ దంపతులు
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:55 PM
మహానంది క్షేత్రంలో శనివారం రాత్రి నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
మహానంది, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో శనివారం రాత్రి నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీకమాసం పురస్కరించుకొని క్షేత్రానికి చేరు కున్న ఎస్పీ దంపతులకు ఆలయం ముఖధ్వారం వద్ద ఆలయ పర్యవేక్షకుడు సుబ్బారెడ్డి, ఎస్‌ఐ రామ్మోహ నరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు అభిషేకార్చన చేశారు. కల్యాణమంటపంలో ఎస్పీ దంప తులను వేదపండితులు ఆశీర్వదించారు. జ్ఞాపికను అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద కార్తీకదీపాలను వెలిగించారు.