Vehicle Strike: 10 నుంచి రవాణా వాహనాల బంద్
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:33 AM
రవాణా వాహనాలకు ఫిట్‌నెస్ చార్జీలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వులకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని...
విజయవాడ సిటీ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రవాణా వాహనాలకు ఫిట్‌నెస్ చార్జీలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వులకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఎస్‌ఐఎంటీఏ) నిర్ణయించింది. ఈ నెల 10వ తేదీ నుంచి రవాణా వాహనాల బంద్ పాటించేందుకు ఎస్‌ఐఎంటీఏ నిర్ణయించిందని ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ సౌత్ జోన్ ఉపాధ్యక్షుడు వైవీ ఈశ్వరరావు తెలిపారు. తమిళనాడులో జరిగిన ఎస్‌ఐఎంటీఏ ప్రతినిధుల సమావేశంలో తీర్మానించిన అంశాలను ఈశ్వరరావు సోమవారం మీడియాకు విడుదల చేశారు. 12 ఏళ్లు పైబడిన వాహనాల యజమానులు ఈ బంద్‌లో పాల్గొంటారని వెల్లడించారు. తమ డిమాండ్ నెరవేరే వరకు ఈ బంద్ కొనసాగుతుందని వివరించారు.