త్వరలో ‘అన్నదాత సుఖీభవ’
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:35 PM
త్వరలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద నగదును రైతుల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం జమ చేస్తుందని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
డోన టౌన, జూలై 22 (ఆంధ్రజ్యోతి): త్వరలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద నగదును రైతుల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం జమ చేస్తుందని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని 4వ వార్డు, మండలంలోని జగదుర్తి, ఉడుములపాడు, తాటిమాను కొత్తూరు గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఉడుములపాడులో గోకులషెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోట్రికే ఫణిరాజ్, వలసల రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి విజయభట్, ఓబులాపురం శేషిరెడ్డి, భాస్కర్ నాయుడు, కమలాపురం సర్పంచ రేగటి అర్జున రెడ్డి, కమిషనర్ ప్రసాద్‌గౌడు, ఎంపీడీవో వెంకటేశ్వర రెడ్డి, ట్రాన్సకో ఏఈ నాగేశ్వరరెడ్డి, డాక్టర్ నాగరాజు, నాయకులు పాల్గొన్నారు.