Share News

Family Tragedy: కారుణ్య నియామకం కోసం కన్న తండ్రి హత్య

ABN , Publish Date - Sep 04 , 2025 | 04:36 AM

తండ్రి చనిపోతే కారుణ్య నియామకం వస్తుందన్న దురాశతో.. కన్నతండ్రినే అతి కిరాతకంగా హతమార్చాడో సుపుత్రుడు...

Family Tragedy: కారుణ్య నియామకం కోసం కన్న తండ్రి హత్య

  • కర్నూలు జిల్లాలో దారుణం

కోడుమూరు రూరల్‌, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): తండ్రి చనిపోతే కారుణ్య నియామకం వస్తుందన్న దురాశతో.. కన్నతండ్రినే అతి కిరాతకంగా హతమార్చాడో సుపుత్రుడు!. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుంది. కోడుమూరు మండలం పులకుర్తికి చెందిన రామాచారి కొడుకు వీరసాయి డిగ్రీ వరకు చదివి కర్నూలులో ఓ ఫార్మసీ షాపులో పనిచేస్తున్నాడు. అతడికి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరిక. కొన్ని నెలల క్రితం తన తండ్రితో పాటు పని చేసే ఓ డ్రైవర్‌ విధుల్లో ఉండగా గుండెపోటుతో చనిపోగా కారుణ్య నియామకం కింద అతడి కొడుక్కి ఉద్యోగం వచ్చింది. దీంతో.. తండ్రి చనిపోతే తనకూ ఉద్యోగం వస్తుందన్న ఆలోచన వీరసాయి మనసులో బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలో వీరసాయి భార్య సుప్రియ నెల రోజుల క్రితం రెండో కాన్పు నిమిత్తం పుట్టింటికి వెళ్లింది. తల్లి విరూపాక్షమ్మ కూడా రెండు రోజుల క్రితం పుట్టినిల్లు చిన్నతుంబలం వెళ్లింది. మంగళవారం రాత్రి తండ్రీకొడుకులిద్దరే భోజనం చేసి పడుకున్నారు. వీరసాయి తెల్లవారుజామున ఇంట్లో ఉన్న రోకలితో తండ్రి తల, నుదుటిపై విచక్షణారహితంగా కొట్టి హత్య చేశారు. విషయం బయటకు పొక్కడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Sep 04 , 2025 | 04:36 AM