Share News

Vijayawada: సోనోవిజన్‌ లక్కీ డ్రా విజేతలు వీరే...

ABN , Publish Date - Aug 17 , 2025 | 06:02 AM

సోనోవిజన్‌ ఇండిపెండెన్స్‌ డే సేల్‌ లక్కీ డ్రాలో విజయవాడ వాసి హోండా అమేజ్‌ కారును సొంతం చేసుకున్నారు.

Vijayawada: సోనోవిజన్‌ లక్కీ డ్రా విజేతలు వీరే...

  • మొదటి బహుమతిగా విజయవాడ వాసికి హోండా అమేజ్‌

విజయవాడ, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): సోనోవిజన్‌ ఇండిపెండెన్స్‌ డే సేల్‌ లక్కీ డ్రాలో విజయవాడ వాసి హోండా అమేజ్‌ కారును సొంతం చేసుకున్నారు. సోనోవిజన్‌ కొనుగోలుదారులకు ఇచ్చిన లక్కీ డ్రా కూపన్‌ల నుంచి శనివారం రాత్రి విజేతను ఎంపిక చేశారు. స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో నగరానికి చెందిన ఉమామహేశ్వరరావు హోండా అమేజ్‌ కారును గెలుచుకున్నారు. పెనమలూరుకు చెందిన షేక్‌ మీరావలి ఎల్‌ఈడీ టీవీని, ప్రసాదంపాడుకు చెందిన బిందుపావని రిఫ్రిజిరేటర్‌, కట్టుబడిపాలెంకు చెందిన డి.దుర్గాప్రసాద్‌ వాషింగ్‌ మెషీన్‌ గెలుచుకున్నారు. దేశంలోని అతిపెద్ద కంపెనీల నుంచి ఎల్‌ఈడీ, మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌, రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషిన్స్‌, ఏసీ, కిచెన్‌ అప్లయేన్స్‌లపై గతంలో ఎన్నడూ లేనంతగా డిస్కౌంట్‌ ఇస్తున్నామని సోనోవిజన్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ పి.భాస్కరమూర్తి ఈ సందర్భంగా తెలిపారు. రూ.30 వేల క్యాష్‌బ్యాక్‌, ఒక ఈఎంఐ రిఫండ్‌ ఆఫర్లు ఇస్తున్నామని చెప్పారు.

Updated Date - Aug 17 , 2025 | 06:02 AM