Bapatla: మద్యం మత్తులో తల్లిని చంపిన కొడుకు
ABN , Publish Date - Sep 26 , 2025 | 04:46 AM
డబ్బులివ్వలేదని మద్యం మత్తులో తల్లిని హతమార్చాడో కుమారుడు. బాపట్ల రూరల్ పోలీసుల కథనం...
బాపట్ల రూరల్, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): డబ్బులివ్వలేదని మద్యం మత్తులో తల్లిని హతమార్చాడో కుమారుడు. బాపట్ల రూరల్ పోలీసుల కథనం ప్రకారం పూండ్ల గ్రామంలో పి.రమణమ్మ(45) అనే మహిళ పంచాయతీ పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆమె కొడుకు జాలయ్య మద్యం తాగి వచ్చి డబ్బులు అడగ్గా ఇచ్చేందుకు నిరాకరించింది. జాలయ్య కోపంతో ఇంట్లో ఉన్న ఇనుప కడ్డీతో తలపై కొట్టడంతో అమె అక్కడిక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.