Share News

Somireddy: డ్రాయర్ల కంపెనీని వెళ్లగొట్టిన వ్యక్తి డేటా కంపెనీ తెచ్చాడట..

ABN , Publish Date - Oct 24 , 2025 | 04:07 AM

పాపాలు చేసే జగన్‌ వంటి వ్యక్తులు కూడా నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.

Somireddy: డ్రాయర్ల కంపెనీని వెళ్లగొట్టిన వ్యక్తి  డేటా కంపెనీ తెచ్చాడట..

జగన్‌ పూర్తి పిచ్చోడని నిర్ధారణయింది: సోమిరెడ్డి

నెల్లూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): పాపాలు చేసే జగన్‌ వంటి వ్యక్తులు కూడా నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఎక్స్‌ వేదికకగా ఆయన స్పందించారు. ‘తాను చేసే నకిలీ మద్యం వ్యవహారంతో తనకు సంబంధం లేదని బుకాయిస్తాడు. తనకు సంబంధం లేని గూగుల్‌ అంశంలో తానే క్రెడిట్‌ దక్కించుకునేలా మాట్లాడుతున్నాడు. డ్రాయర్ల కంపెనీని వెళ్లగొట్టిన వ్యక్తి డేటా కంపెనీ తెచ్చాడట..! చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి. డేటా సెంటర్‌ అంటే... అదో గోడౌన్‌ అని సాక్షిలో రాయిస్తారు. మళ్లీ దాన్ని తెచ్చింది తానేనంటాడు. పెట్టుబడులు రాకుండా చేసి, సొంత కంపెనీల ద్వారా మద్యం సరఫరా చేయించి ప్రజా ధనాన్ని గుటుక్కున మింగిన ఆయన... గూగుల్‌ తెచ్చారా..? భోగాల కోసం రుషికొండ ప్యాలెస్‌ కట్టుకున్న పెద్ద మనిషి.. భోగాపురం ఎయిర్‌పోర్టు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇన్నాళ్లూ జగన్‌ సగం పిచ్చోడనుకున్నాం.. ఇప్పుడు పూర్తి పిచ్చోడని అర్థమైంది’ అంటూ మండిపడ్డారు.

Updated Date - Oct 24 , 2025 | 04:09 AM