ప్రజా సమస్యలు పరిష్కరిస్తా
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:45 PM
ప్రజలు, రైతులు ఎదుర్కొంటు న్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి
డోన టౌన, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ప్రజలు, రైతులు ఎదుర్కొంటు న్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 8వ వార్డులో ఎమ్మెల్యే పర్యటించారు. అక్కడి ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. సంబంధిత అధికారులు సమస్యల ను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించి, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌లో రూ.5 లక్షల నిధులతో మంజూరైన వాటర్ పైపులైన పనులకు శంకు స్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై కేడీసీ ఎంఎస్ చైర్మన వై.నాగేశ్వ రరావు యాదవ్‌తో కలిసి భూమి పూజ చేశారు. త్రివర్ణ కాలనీలో కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త మంగమూరి గోపాల్ మృతి చెందాడు. ఆయనకు టీడీపీ సభ్యత్వం ఉండటంతో వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌గౌడు, టీడీపీ, బీజేపీ నాయకులు, సర్పంచులు ఉన్నారు.
బీమా చెక్కు అందజేత
ప్యాపిలి : మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్త కుల్లాయప్ప ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఆయనకు మంజూరు అయిన ప్రమాద బీమా చెక్కు రూ. ఐదు లక్షలను శుక్రవారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల కోసం దేశంలో ఏ పార్టీ కూడా కార్యకర్తలకు ఇంత పెద్ద మొత్తంలో ప్రమాద బీమా కల్పించలేదన్నారు. కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. అనంతరం ఆయన స్థానికి ప్రభుత్వ విశ్రాంతి భవనంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన వై నాగేశ్వరరావుయాదవ్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రాజా నారాయణమూర్తి, లక్ష్మీనారాయణయాదవ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.