సోలార్ వాహనాల అడ్డగింత
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:24 AM
మండలంలోని పిన్నాపురం పరిధిలోని గ్రీనకో నిర్వహిస్తున్న సోలార్ నిర్మాణ పనులను శుక్రవారం రైతులు, పశుకాపరులు అడ్డుకున్నారు.
పాణ్యం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పిన్నాపురం పరిధిలోని గ్రీనకో నిర్వహిస్తున్న సోలార్ నిర్మాణ పనులను శుక్రవారం రైతులు, పశుకాపరులు అడ్డుకున్నారు. సీపీఎం ఆధ్వర్యంలో పనులను జరగకుండా వాహనాలను నిలిపివేశారు. దీంతో పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సోలార్ నిర్వాహకులు, సీపీఎం నాయకులతో చర్చించారు. రైతు సంఘం నాయకులు రామచంద్రుడు మాట్లాడుతూ రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు కోరినట్లు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సుమారు 52 ఎకరాల భూమిని కేటాయించాలని, నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని, భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అధికారులందరూ ఈనెల 23న పిన్నాపురంలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారని వివరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, ఏపీ రైతు సంఘం నాయకులు రామచంద్రుడు, సీఐటీయూ కార్యదర్శి భాస్కర్, తిమ్మాపురం గ్రామ రైతులు రమేష్, మాసుమయ్య, నారాయణ, కిట్టప్ప, రైతులు పాల్గొన్నారు.