Agricultural Pumpsets: వ్యవసాయ పంపుసెట్లు, ఫీడర్లకు సోలార్ విద్యుత్తు
ABN , Publish Date - Aug 24 , 2025 | 06:20 AM
ప్రధానమంత్రి కుసుమ్ పథకంలో భాగంగా రాష్ట్రంలో 2.93లక్షల వ్యవసాయ పంపుసెట్లు, 1156 వ్యవసాయ ఫీడర్లకు సౌర విద్యుత్తు అందించాలన్న లక్ష్యాన్ని సకాలంలో నెరవేర్చాలని...
5842 ఎకరాల్లో సౌర విద్యుత్తు ప్లాంట్ల స్థాపన
‘పీఎం కుసుమ్’ లక్ష్యంపై డిస్కమ్‌లకు సీఎస్ ఆదేశాలు
అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి కుసుమ్ పథకంలో భాగంగా రాష్ట్రంలో 2.93లక్షల వ్యవసాయ పంపుసెట్లు, 1156 వ్యవసాయ ఫీడర్లకు సౌర విద్యుత్తు అందించాలన్న లక్ష్యాన్ని సకాలంలో నెరవేర్చాలని డిస్కమ్‌లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. శనివారంవిజయవాడ క్యాంపు కార్యాలయంలో డిస్కమ్‌ల సీఎండీలు పృథ్వీతేజ్, సంతోష్‌రావు, పుల్లారెడ్డి, ట్రాన్స్‌కో గ్రిడ్ డైరెక్టర్ ఏకేవీ భాస్కర్, నెడ్‌క్యాప్ ఎండీ బి.కమలాకరబాబుతో సీఎస్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులు, విద్యుత్తు సరఫరాపై సమీక్షించారు. 5842ఎకరాల్లో 1162.8 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. కలెక్టర్లతో సంప్రదింపులు జరుపుతూ, పెండింగ్‌లో ఉన్న 1700 ఎకరాల భూమిని సోలార్ ప్లాంట్ల కోసం సమీకరించాలని నెడ్‌క్యాప్, డిస్కమ్‌లకు సూచించారు.