Sol Bojjireddy Sworn: ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా బొజ్జిరెడ్డి ప్రమాణం
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:20 AM
రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా సోళ్ల బొజ్జిరెడ్డి, సభ్యులుగా జి.సునీత, కె.లక్ష్మి, కె.సాయిరాం, కె.మల్లేశ్వరరావు, వెంకటప్ప సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు....
అమరావతి, విజయవాడ(వన్‌టౌన్), నవంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా సోళ్ల బొజ్జిరెడ్డి, సభ్యులుగా జి.సునీత, కె.లక్ష్మి, కె.సాయిరాం, కె.మల్లేశ్వరరావు, వెంకటప్ప సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఆర్‌అండ్‌బీ భవనంలో ఉన్న ఎస్టీ కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే మిరియాల శిరీష ఎస్టీ కమిషన్ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. గిరిజన యోధుడు బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా 15 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.