Anantapur District: బుల్లెట్ రైల్వే లైన్ కోసం భూ పరీక్షలు
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:23 AM
రాష్ట్రంలో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు దిశగా చర్యలు మొదలయ్యాయి. బెంగుళూరు-హైదరాబాద్, హైదరాబాదు-చెన్నై మధ్య బుల్లెట్ (హైస్పీడ్ రైలు) రైలు మార్గం ఏర్పాటు చేయాలని...
అనంతపురం జిల్లాలో నిపుణుల పర్యటన
బుక్కరాయసముద్రం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు దిశగా చర్యలు మొదలయ్యాయి. బెంగుళూరు-హైదరాబాద్, హైదరాబాదు-చెన్నై మధ్య బుల్లెట్ (హైస్పీడ్ రైలు) రైలు మార్గం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. హైద రాబాదు-చెన్నై మార్గం రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మీదుగా వెళు తుంది. బెంగళూరు-హైదరాబాదు రైలు మార్గం అనంతపురం జిల్లా మీదుగా వెళు తుంది. ఈ క్రమంలో హైస్పీడ్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మట్టి పరీక్షలు నిర్వహించారు. అనంతపురం రూరల్ మండలంలోని కొన్ని గ్రామాలు, బుక్కరాయసముద్రం మండలంలోని దేవరకొండ వెనుక భాగం, సిద్దరాంపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో నిపుణుల బృందం భూ పరీక్షలు నిర్వహించింది. బుక్కరాయసముద్రం మండల వ్యాప్తంగా దాదాపు 40 పాయింట్లలో మట్టి నమూనాలను సేకరించి, పరీక్షించారని సమాచారం. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు గ్రౌండ్ లెవెల్ రిపోర్టును సిద్ధం చేస్తున్నారని నిపుణులు తెలిపారు.