Share News

AP Govt: సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోకి సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు

ABN , Publish Date - Nov 26 , 2025 | 06:17 AM

మహిళా శిశు సంక్షేమశాఖ పరిధిలో ఉన్న సోషల్‌ వెల్ఫేర్‌బోర్డును సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోకి మార్చారు.

AP Govt: సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోకి సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు

  • చైర్మన్‌గా పోతుల బాలకోటయ్య నియామకం

అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మహిళా శిశు సంక్షేమశాఖ పరిధిలో ఉన్న సోషల్‌ వెల్ఫేర్‌బోర్డును సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోకి మార్చారు. అలాగే, ఈ బోర్డుకు చైర్మన్‌గా పోతుల బాలకోటయ్యను నియమిస్తూ సాంఘిక సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, నలుగురు సభ్యులను కూడా ప్రభుత్వం నియమించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో సోషల్‌ వెల్ఫేర్‌బోర్డు మహిళా శిశు సంక్షేమశాఖ పరిధిలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని సోషల్‌ వెల్ఫేర్‌బోర్డును కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం మూసేసింది. ఎస్సీల అభివృద్ధికి ఈ సంస్థను తిరిగి ప్రారంభించాలని తాజాగా నిర్ణయించింది. దీంతో అటానమస్‌ సంస్థగా సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో సోషల్‌ వెల్ఫేర్‌బోర్డును తిరిగి ఏర్పాటు చేశారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. ఈ సంస్థకు సిబ్బందిని కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎస్సీల్లో విద్య, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి చేపట్టేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఎస్సీల్లో చైతన్యం కలిగించేందుకు, వారి హక్కుల అమలుకు, ఎస్సీలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు, ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ అందించి, వారి నిరుద్యోగ నిర్మూలనకు, బాల్య వివాహాలు, అంటరానితనం నిర్మూలన కోసం ఈ సంస్థ పనిచేస్తుంది.

Updated Date - Nov 26 , 2025 | 06:17 AM