Social Service: జూదరులతో సామాజిక సేవ
ABN , Publish Date - Nov 07 , 2025 | 05:33 AM
వీరంతా జూదం ఆడుతూ దొరికిపోయారు. ఇప్పుడు జూదం వద్దంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్డుపై నిలబడ్డారు. జూదం ఆడటం నేరమంటూ ప్రచారం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వీరంతా జూదం ఆడుతూ దొరికిపోయారు. ఇప్పుడు జూదం వద్దంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్డుపై నిలబడ్డారు. జూదం ఆడటం నేరమంటూ ప్రచారం చేస్తున్నారు. ‘‘జూదం ఆడటం చట్టరీత్యా నేరం, బహిరంగ ప్రదేశాలలో మద్యపానం నిషేదం అంటూ ప్లకార్డులు పట్టుకుని శ్రీకాకుళంలోని ప్రదాన జంక్షన్ల వద్ద ప్రచారం చేస్తున్న ఈ వ్యక్తులు కొన్ని రోజుల క్రితం జూదం ఆడుతూ పట్టుబడ్డారు. వారిని పోలీసులు బుధవారం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. వీరికి ఒక్కొక్కరికీ రూ.వెయ్యి జరిమానా, పదిరోజులు సామాజిక సేవ చేయాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. ఆ మేరకు శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రధాన రోడ్లపై ఈ ఐదుగురు జూదానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ కనిపించారు.
- శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి